రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘2.0’. ‘రోబో’కు సీక్వెల్‌గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోందీ చిత్రం. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు శంకర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘‘ఇటీవలే కీలక సన్నివేశాల్ని చిత్రీకరించాం. ఒక పాట, కొన్ని సన్నివేశాలే మిగిలున్నాయి. త్వరలోనే వాటినీ పూర్తి చేస్తాం.’’ అంటూ తను చిత్రబృందంతో ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు శంకర్. ఈ చిత్రంలో బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అమీ జాక్సన్ కథానాయిక. దీపావళికి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
With my team after finishing a major scene of #2.0 . One song and some patch works are only the balance pic.twitter.com/SG6o1nLUW4— Shankar Shanmugham (@shankarshanmugh) March 9, 2017
Post A Comment: