మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా దర్శకుడు మణిరత్నం ఓ చిత్రం తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ‘ధృవ’ చిత్రంలో హీరో రామ్‌చరణ్‌కు గట్టి విలన్‌గా నటించి, ప్రశంసలు అందుకున్న నటుడు అరవింద్ స్వామి మళ్లీ చెర్రీతో కలిసి ఈ చిత్రంలో కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కార్తీతో తెరకెక్కించిన ‘చెలియా’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మణిరత్నం ఆ సినిమా విడుదల తర్వాత రామ్‌చరణ్‌తో సినిమా షురూ చేయనున్నారట. ఇప్పటికే ఆయన ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని రామ్‌చరణ్, మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారట. మిగిలిన చిత్ర బృందాన్ని త్వరలోనే ఖరారు చేస్తారని సమాచారం. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు.
Ram Charan and Aravind Swamy to team up again in Maniratnam's film | Ram Charan with Manirathnam | Ram Charan again with Aravind Swamy | Maniratnam's next with Ram Charan | Aravind Swamy to act again in Mani Ratnam's movie
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా దర్శకుడు మణిరత్నం ఓ చిత్రం తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ‘ధృవ’ చిత్రంలో హీరో రామ్‌చరణ్‌కు గట్టి విలన్‌గా నటించి, ప్రశంసలు అందుకున్న నటుడు అరవింద్ స్వామి మళ్లీ చెర్రీతో కలిసి ఈ చిత్రంలో కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కార్తీతో తెరకెక్కించిన ‘చెలియా’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మణిరత్నం ఆ సినిమా విడుదల తర్వాత రామ్‌చరణ్‌తో సినిమా షురూ చేయనున్నారట. ఇప్పటికే ఆయన ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని రామ్‌చరణ్, మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారట. మిగిలిన చిత్ర బృందాన్ని త్వరలోనే ఖరారు చేస్తారని సమాచారం. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు.
Post A Comment: