దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ నటించి, మూడు దశాబ్దాలకి పైగా తిరుగులేని నటిగా చిత్ర పరిశ్రమలో కొనసాగారు సావిత్రి. కథానాయకుల ఆధిపత్యం కొనసాగుతున్న కాలంలోనే పరిశ్రమపైనా, ప్రేక్షకులపైనా తనదైన ముద్ర వేసి మహానటి అనిపించుకున్నారు. 263 చిత్రాల్లో నటించిన సావిత్రి జీవితం ఆధారంగా ‘మహానటి’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో విమర్శకుల ప్రసంశలందుకున్న యువ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బుధవారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘మహానటి’ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. సావిత్రితో పాటు సమంత, కీర్తి సురేష్ ల ముఖ చిత్రాలున్న ఈ పోస్టర్ అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా పోస్టర్ మీద ‘తరాలను నిర్మించే స్త్రీ జాతికోసం తరతరాలు గర్వించే మహానటి సావిత్రి కథ’ అని రాసి ఉన్న క్యాప్షన్ సినిమా పట్ల బలమైన పాజిటివ్ ఫీలింగ్ కలిగేలా చేస్తోంది.
Here it is..... Our first step on this epic journey.— #Mahanati (@VyjayanthiFilms) March 8, 2017
Come be a part of history #Mahanati #మహానటి #HappyWomensDay #womensday pic.twitter.com/SdlEBA4ZoO
Post A Comment: