కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై రోజుకో వార్త సినీ పరిశ్రమలను కుదిపిస్తోంది. తమతో శృంగారంలో పాల్గొంటేనే అవకాశాలు ఇస్తామంటూ దర్శకులు, నిర్మాతలు.., ఒక్కోసారి హీరోలు ప్రలోభపెడుతున్నారంటూ హీరోయిన్స్ మీడియాకెక్కుతున్నారు. మళయాళ నటి భావన కేసు తర్వాత పలువురు హీరోయిన్లు నిర్భయంగా మీడియాకు ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి మలయాళ హీరోయిన్ పార్వతి కూడా చేరి అందరికీ షాక్ ఇచ్చారు. ఓ టాక్ షో లో పాల్గొన్న ఆమె మళయాళ చిత్ర పరిశ్రమపై విమర్శలు చేసారు.
పార్వతి మాట్లాడుతూ…“సినిమాలో వేషం కావాలంటే తమతో పడుకోవాలంటూ ఒత్తిడి చేసే జనం ఈ సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. నేను కూడా అలా అడగబడ్డాను. అదేదో తమ హక్కులాగ సూటిగా చాలా బ్లంట్ గా అడిగేస్తారు. నేనైతే నో చెప్పాను. అయితే మనం ఒక స్థాయికి వచ్చాక మాత్రం ఇలాంటివి అడటానికి ఎవరూ ధైర్యం చేయరు.” అని చెప్పింది.
“మలయాళ పరిశ్రమలో ఈ కాస్టింగ్ కౌచ్ వ్యవహారం బాగా విస్తరించింది. అలాంటి వాళ్లు మీకు తెలుసు…నాకూ తెలుసు. అయితే ఇందులో ఆశ్చర్యపోవటానికి, షాక్ కు గురి అవటానికి ఏమీ లేదు. మిగతా ఇండస్ట్రీలలో కూడా ఇలాంటివి నడుస్తున్నాయి. ఇదే వాస్తవం. స్త్రీలు ఇది తెలుసుకుని అందుకు తగ్గట్లుగా తమను తాము రక్షించుకుంటూ కెరీర్ లు నిర్మించుకోవాల్సిందే. వేరే దారి లేదు” అంటూ ఆమె తేల్చి చెప్పింది.
కేరళలో పుట్టి పెరిగిన పార్వతి మీనన్… 2006లో 'ఔట్ ఆఫ్ సిలబస్' అనే మలయాళ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మలయాళంతో పాటు పలు తమిళ చిత్రాల్లో నటించింది. మలయాళంలో వచ్చిన 'బెంగుళూరు డేస్' ఆమెకు బాగా పేరు తెచ్చింది. తమిళంలో ధనుష్ తో ఆమె నటించిన 'మరియన్' తెలుగులోనూ రిలీజైంది.
Post A Comment: