అఖిల్ అక్కినేని కొత్త చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏప్రిల్ 2 న సాయంత్రం 6:17 కి అక్కినేని కుటుంభ సభ్యుల సమక్షంలో ప్రారంభమైంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజస్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు మునిమనవరాలు సత్య సాగరి క్లాప్ నివ్వగా, దర్శకుడు కె.రాఘవేంద్రరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. దేవుడి పటాలపై తొలి షాట్‌ను చిత్రీకరించారు. అఖిల్, విక్రమ్ కె కుమార్, నాగార్జున, అమల, నాగచైతన్య, సుప్రియ, నాగ సుశీల, సుమంత్, యార్లగడ్డ సురేంద్ర ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘మనం’ సాంకేతిక బృందం పనిచేస్తున్న ఈ సినిమా తప్పకుండా మరో విజయం సాధిస్తుందన్నారు. ‘అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో ‘మనం’ తర్వాత మళ్లీ మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. అఖిల్‌కు ఇదొక మంచి కమర్షియల్ చిత్రంగా నిలుస్తుంద’న్నారు దర్శకుడు విక్రమ్ కె కుమార్. చిత్రానికి అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నారు.
2015 లో విడుదలైన ‘అఖిల్’ చిత్రంతో హీరోగా వెండి తెరకు పరిచయమయ్యాడు అఖిల్. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోవడంతో కాస్త నిరుత్సాహానికి గురైన అఖిల్ ఈసారి లాంగ్ గ్యాప్ తీసుకుని పక్కా ప్లాన్ తో రెండవ సినిమాని మొదలుపెట్టాడు. దీంతో అఖిల్ రెండవ చిత్రం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన అక్కినేని ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం మొదలైంది. నాగార్జున కూడా ఈ విషయం గురించి ట్విట్టర్లో ప్రస్తావిస్తూ ‘సహనం ఎప్పుడూ లాభదాయకమే’ అన్నారు. అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ వంటి క్లాసికల్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై మంచి క్రేజ్ నెలకొంది. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ ఈరోజు (ఏప్రిల్ 3) నుండే మొదలుకానుంది. ‘ఎక్కడ ఎక్కడ ఉందో తారక’ వంటి క్లాసీ టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం ఇంకా ఫైనల్ కాలేదు. ఇకపోతే ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం, పివి వినోద్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు.
Post A Comment: