అల్లు శిరీష్ కథానాయకుడిగా సురభి, సీరత్ కపూర్ కథానాయికలుగా లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీనివాస్ అవసరాల ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. చక్రి చిగురుపాటి నిర్మాత. ఆదివారం (ఏప్రిల్ 9) హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, చిత్ర నిర్మాత తండ్రి శంకర్ చిగురుపాటి కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు ఆనంద్ మాట్లాడుతూ ‘‘సైంటిఫిక్ అంశాలతో కూడిన ఓ కల్పిత కథ ఇది. రొమాంటిక్ థ్రిల్లర్‌గా, చిత్రంలోని ప్రతి పాత్రకీ ప్రాధాన్యమిస్తూ తెరకెక్కిస్తున్నాం. ఈ నెలాఖరు నుంచే చిత్రీకరణ మొదలవుతుంది’’ అన్నారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ ‘‘అన్ని వర్గాల్ని మెప్పించే ఓ మంచి కమర్షియల్ చిత్రమవుతుంది. మలయాళంలో నేను నటించిన ‘1971 బియాండ్ బోర్డర్స్’తో పాటు ‘దృశ్యం’ లాంటి విజయవంతమైన చిత్రాలకి పని చేసిన ఛాయాగ్రాహకుడు సుజిత్ వాసుదేవ్, ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి పనిచేస్తున్నార’’న్నారు. ఒక మంచి కథలో భాగమైనందుకు ఆనందంగా ఉందని చెప్పింది సురభి. మరో హీరోయిన్ సీరత్ కపూర్ మాట్లాడుతూ ‘‘ఈ దర్శకుడితో నేను చేస్తున్న రెండో చిత్రమిది. కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయి.’’ అని చెప్పింది. ‘‘కథతో పాటు నా పాత్రా బాగుంటుంది. శిరీష్‌తో నేను చేస్తున్న తొలి చిత్రమిది’’ అన్నారు అవసరాల శ్రీనివాస్.
'శ్రీరస్తు శుభమస్తు' వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం కావడం, 'ఎక్కడికి పోతావు చిన్నవాడ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కళ: నాగేంద్రప్రసాద్, కూర్పు: ఛోటా కె. ప్రసాద్, సహనిర్మాతలు: సతీష్ వేగేశ్న, రాజేష్ దండ.
Post A Comment: