ఈ మధ్యకాలంలో మలయాళీ నటి అమలాపాల్ పేరు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో వినిపిస్తూ వస్తోంది. విడాకుల ఇష్యూ ముగిసిన తర్వాత ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. బుద్ధుడు పెయింటింగ్ ఉన్న గోడ ముందు యోగా చేస్తూండగా తీసిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేశారు. అయితే అందులోని ఓ ఫొటోలో శీర్షాసనం వేస్తుండగా ఆమె కాలు గోడపైఉన్న బుద్ధుడు ముఖానికి తగిలినట్లు కనిపిస్తోంది. ఈ ఫొటోలను చూసిన కొంతమంది యోగా చక్కగా చేస్తున్నావని అమలాపాల్‌ను ప్రశంసిస్తుండగా, మరి కొందరు విమర్శిస్తున్నారు. యోగా చేయడం వరకు బాగానే ఉందని, కానీ బుద్ధుడ్ని గౌరవించడం నేర్చుకోమని మండిపడ్డారు.
బౌద్ధమతాన్ని అనుసరించే కొందరు... అమలాపాల్ ఆ ఫోటోలను డిలిట్ చేయాలని, క్షమించమని కోరాలని డిమాండ్ చేశారు. అయితే అమలాపాల్ ఈ విషయం గురించి స్పందించలేదు, ఫోటోలనూ డిలీట్ చేయలేదు. ప్రస్తుతం అమలాపాల్ ధనుష్ సరసన ‘వీఐపీ-2’ చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు పలు తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తున్నారు.
Post A Comment: