అగ్ర కథానాయిక నయనతార నటిస్తున్న తమిళ చిత్రం ‘అరమ్’. గోపి నైనార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. మన రైతులకు ఈ టీజర్ అంకితమంటూ ట్వీట్ చేశారు. యూట్యూబ్‌లో ఈ సినిమా టీజర్‌కు, నయనతార నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. కలెక్టర్ పాత్రలో నయనతార ఒదిగిపోయారని, చక్కటి కథతో చిత్రాన్ని తీస్తున్నారని, ఆమెను లేడీ సూపర్‌స్టార్ అనడంలో ఆశ్చర్యం లేదని అభిమానులు పొగిడేస్తున్నారు.
పల్లెటూరు ప్రజలు ఎదుర్కొంటున్న నీటి, వ్యవసాయ ఇతర సమస్యలను తీర్చడానికి ఓ మహిళా కలెక్టర్ ఏవిధంగా ముందుకు సాగారన్న అంశం చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. 'కాక ముట్టై' ఫేం రమేష్, విఘ్నేష్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఓం ప్రకాష్ ఛాయాగ్రహణం, మహమ్మద్ జీబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు.
Here's the teaser of #Aramm dedicated to our farmers. https://t.co/W87k0eR4Qu— A.R.Rahman (@arrahman) April 5, 2017
All the best @kjr_studios #Nayanthara #ArammForFarmers
Post A Comment: