గోపీచంద్ హీరోగా 'గౌతమ్ నంద' అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా, బుర్జ్ అల్ అరబ్ వంటి ఫేమస్ లొకేషన్లలో జరుగుతోంది.. చిత్ర యూనిట్ దుబాయ్ లో ఓ పాటను భారీ స్థాయిలో తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ పాట కోసం గోపీచంద్ పూర్తి స్థాయి స్కై డైవింగ్ చేశారట. ఈ రియల్ స్టంట్ ను ఎలాంటి డూప్ లేకుండా చేశాడు గోపీచంద్. ఒకరకంగా ఇది సాహసమేనని, ఇప్పటివరకు సౌత్ సినిమాలో ఏ హీరో కూడా ఇలాంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్కై డైవింగ్ ఎపిసోడ్ చేయలేదని, సౌత్ సినిమాలోనే ఫస్ట్ టైం స్కై డైవింగ్ చేసిన హీరోగా గోపీచంద్ రికార్డు సృష్టించాడని, గోపి చంద్ గారి ధైర్యానికి, సాహసానికి హ్యాట్సాఫ్ అని దర్శకుడు సంపత్ నంది అన్నారు. అలాగే దుబాయ్ లో చిత్రీకరిస్తున్న ఈ ఎపిసోడ్లు అభిమానులకు ఆశ్చర్యాన్ని, మంచి వినోదాన్ని ఇచ్చే విధంగా ఉంటాయని అన్నారు.
గోపీచంద్ రెండేళ్ల నుంచి గట్టి హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ అయితే ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేకపోయాడు. అందుకే ఇప్పుడు ఆశలన్నీ 'గౌతమ్ నంద' పైనే పెట్టుకున్నాడు. అందుకే ఇంత రిస్క్ చేశాడు. ఈ సినిమాలో గోపీచంద్ ను మోస్ట్ స్టయిలిష్ గా చూపిస్తున్నాడు దర్శకుడు సంపత్ నంది. గోపీచంద్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తోంది 'గౌతమ్ నంద' సినిమా.
ఈ సినిమాలో కెరీర్‌లోనే తొలిసారిగా గోపీచంద్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. సినిమా టైటిల్ లోనే చెప్పినట్టు గౌతమ్, నంద అనే రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ పోషిస్తున్నాడు. హన్సిక, క్యాథరిన్ థ్రెసాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా జె. భగవాన్, జె. పుల్లారావులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Post A Comment: