Telugu Movies Box Office News | Latest Telugu Cinemas Box Office News | Tollywood Films Box Office News | Tollywood Box Office News | All Cinemas Box Office News | Cinerangam.com

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై కిషోర్ పార్థ‌సాని (డాలీ) ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌త్ మరార్ నిర్మించిన రీమేక్ చిత్రం `కాట‌మ‌రాయుడు`. ఈ చిత్రాన్ని ఉగాది సంద‌ర్భంగా 24 మార్చి న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువచ్చారు. 'గ‌బ్బ‌ర్‌సింగ్' త‌ర్వాత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, శృతిహాస‌న్ జంట‌గా న‌టిస్తున్న చిత్ర‌ం కావటం, తమిళ సూపర్ హిట్ చిత్రం రీమేక్ కావటంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే సినిమా మార్నింగ్ షోకే ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది. రీసెంట్ గా ఈ చిత్రం బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా క్లోజ్ చేసారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఫైనల్ కలెక్షన్స్ ని చూద్దాం. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఫైనల్ డిస్ట్రిబ్యూటర్ షేర్ 62.15 కోట్లు. ఈ చిత్రాన్ని 72.5 కోట్లు వరకూ బిజినెస్ చేయటంతో ఫైనల్ గా ఫ్లాఫ్ అని తేలింది. ఓవర్ సీస్ లో అయితే ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఓవర్ సీస్ బయ్యర్లు ఆరున్నర కోట్లు వరకూ నష్టపోయారు.

ఏరియావైజ్ షేర్:
నైజాం: 15.40 కోట్లు
సీడెడ్: 8.26 కోట్లు
ఉత్తరాంధ్ర: 6.26 కోట్లు
గుంటూరు: 4.97 కోట్లు
ఈస్ట్ గోదావరి: 5.35 కోట్లు
వెస్ట్ గోదావరి: 4.22 కోట్లు
కృష్ణా: 3.69 కోట్లు
నెల్లూరు: 2.10 కోట్లు
ఆంధ్రా + తెలంగాణా: 50.25 కోట్లు
కర్ణాటక + తమిళనాడు + నార్త్ ఇండియా: 6.55 కోట్లు
ఓవర్ సీస్: 5.35 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 62.15 కోట్లు
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: