నటి కిమ్ శర్మ ప్రస్తుతం కష్టాల్లో ఉందట. కొంతకాలంగా కిమ్ శర్మ వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఎన్నో పుకార్లు వచ్చాయి. కృష్ణవంశీ 'ఖడ్గం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమై, తెలుగులోనే కాకుండా పలు హిందీ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి కిమ్ శర్మ. కెరీర్ మొదట్లో హీరోయిన్ గా మెరిసిన ఈ భామ రానా రాను ఐటెమ్ సాంగ్ లు చేస్తూ కాలం గడిపింది. 2009 లో వచ్చిన 'మగధీర', 'ఆంజనేయులు' సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కనిపించింది.
సినిమా ఛాన్సులు బాగా తగ్గిపోవడంతో ఇక లాభం లేదనుకొని ఏడేళ్ల క్రితం 2010 లో సినిమాలకు స్వస్తి చెప్పి కెన్యాకి చెందిన అలీ పంజాని అనే వ్యాపారవేత్తను కిమ్ వివాహం చేసుకుంది. పెళ్లైన కొన్నాళ్ల తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడినట్టు తెలుస్తోంది. దాదాపు కొన్ని సంవత్సరాలు బాగానే గడిచిన వీరిద్దరి దాంపత్యం జీవితం కొన్ని నెలల క్రితం విడాకుల వరకు వచ్చిందట.
ఇదిలా ఉండగా ఇప్పుడు కిమ్ భర్త.. అలీ పంజానీ మరో యువతి కోసం కిమ్‌ని వదిలేసినట్లూ తాజాగా వినిపిస్తోంది. దీంతో కిమ్ శర్మ పరిస్థితి అతి దారుణంగా మారిపోయిందని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో కిమ్ ఏమీ చేయలేక చేతిలో చిల్లి గవ్వ లేకుండా కొద్దినెలలుగా ముంబైలోని తన నివాసంలో ఉంటోందట. ముంబైలో సొంతంగా వ్యాపారం చేసుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆమె ప్రయత్నిస్తోందట.
Post A Comment: