సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న... మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా నటిస్తున్న సినిమా తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సినిమాకు ‘స్పైడర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో మహేశ్‌బాబు చాలా ప్రొఫెషనల్‌గా, కొత్త లుక్‌లో కనిపించారు. చేతిలో తుపాకీ పట్టుకుని, ఓ గోడకు ఆనుకుని నిల్చున్న ఈ ఫస్ట్‌లుక్ చిత్రాలు అభిమానుల్ని ఆకట్టుకునేలా ఉంది. ఈరోజు (ఏప్రిల్ 12) సాయంత్రం 5 గంటలకు లుక్ బయటకు రాగానే అభిమానులు సోషల్ మీడియాలో దాన్ని 'స్పైడర్' హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో కొద్దిసేపటికే ఈ ఫస్ట్‌లుక్ ప్రపంచస్థాయి ట్రెండింగ్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను కూడా ఫస్ట్‌లుక్‌తో పాటే రిలీజ్ చేశారు.
ఈ చిత్రం ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళంలలో రిలీజ్ కానుండటంతో హైప్ భారీ స్థాయిలో ఉంది. ఆ అంచనాలకు తగ్గట్టే మురుగదాస్ సినిమాను చాలా పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారు. క్లైమాక్స్, రెండు పాటల మినహా మిగిలిన చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్నఈ చిత్రంలో ఎస్.జె. సూర్య ప్రతినాయకుడు పాత్ర పోషిస్తున్నారు. హారిస్ జయరాజ్ స్వరాలు సమకూరుస్తున్నారు. సంతోష శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Here it is !!! https://t.co/8MJoYH4Imt— A.R.Murugadoss (@ARMurugadoss) April 12, 2017
Post A Comment: