మెగా హీరో వరుణ్ తేజ్ ఎన్నో ఆశలతో నటించిన చిత్రం ‘మిస్టర్’. ప్రేక్షకులు కూడా దర్శకుడు శ్రీను వైట్లకు కమ్ బ్యాక్ చిత్రం అవుతుందని మంచి అంచనాలు పెట్టుకున్నారు. కానీ గత శుక్రవారం విడుదలైన ‘మిస్టర్’ మాత్రం అన్ని అంచనాలకు వ్యతిరేకంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఎంతో అంచనాలతో యుఎస్ బాక్సాఫీస్ వద్ద రిలీజ్ చేస్తే అక్కడా అదే పరిస్దితి. రివ్యూలలో అతి తక్కువ రేటింగ్ లు ఇవ్వటం కొంప ముంచిందంటున్నారు. రివ్యూలు రాకముందు యుఎస్ లో వేసిన ప్రీమియర్ షోలకు 35k డాలర్లు గ్రాస్ వస్తే, ఆ తర్వాత సీన్ మారిపోయింది. తర్వాత మూడు రోజులు కలిపినా అంత రాలేదు. వీకెండ్ లో పరిస్దితి దారుణంగా ఉంది. మొత్తానికి ఫస్ట్ వీకెండ్ 70k డాలర్లు వచ్చినట్లు లెక్క. ఈ చిత్రాన్ని తెలుగు ఫిల్మ్ నగర్ వారు అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసారు. మొత్తం నష్టపోయినట్లే.
అమెరికాలో 'మిస్టర్' రోజువారీ కలెక్షన్స్ ఇలా వున్నాయి:
ప్రివ్యూల ద్వారా: $ 35,060
శుక్రవారం: $ 16,483
శనివారం: $ 12,843
ఆదివారం: $ 5,986
వీకెండ్ టోటల్ కలెక్షన్స్: $ 70,372
ఇదిలా వుండగా, సాధారణంగా గత నెల రోజుల్లో ప్రతి శుక్రవారం ఏదో ఒక పెద్ద సినిమా లేదా చెప్పుకోదగిన సినిమా ఒకటి రిలీజవుతూ వస్తోంది. దీంతో సినిమాల మధ్య పోటీ ఉండేది. కానీ రాబోయే శుక్రవారం ఒక ‘లంక’ మినహా మరే సినిమా విడుదలకావడంలేదు. దీంతో మిస్టర్ కు ఈ పోటీ బాధ తప్పింది. అలాగే ప్రస్తుతం థియేటర్లలో కూడా ‘మిస్టర్’ తో పాటు విడుదలైన ‘శివలింగ’ మినహా మరో కొత్త చిత్రం లేదు. ఏమైనా పోటీ అంటూ ఉంటే ఈ సినిమాతోనే ఉండాలి. కాబట్టి వరుణ్ – శ్రీను వైట్లల సినిమా ‘శివలింగ’ను తట్టుకుంటే ‘బాహుబలి-2’ రిలీజయ్యే వరకు కలెక్షన్స్ రాబట్టుకునే అవకాశం వుంటుంది.
వరుణ్ తేజ గత చిత్రం 'లోఫర్' లాంగ్ రన్‌లో కనీసం రూ.10 కోట్ల షేర్ అయినా రాబట్టింది. 'మిస్టర్' సినిమా రూ.5 కోట్ల షేర్ సాధించినా గ్రేటే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ప్రస్తుతం వరుణ్ ఆశలన్నీ శేఖర్ కమ్ముల 'ఫిదా' మీదే ఉన్నాయి.
Post A Comment: