పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి ‘గోకుల కృష్ణుడు’ అనే టైటిల్ అనుకుంటున్నారట. ఈ టైటిల్ అయితే అటు క్లాస్‌కి ఇటు మాస్‌కి నచ్చుతుందని భావిస్తున్నారట. ఈ చిత్రంలో అను ఇమాన్యుయేల్, కీర్తి సురేష్ హీరొయిన్లుగా నటిస్తున్నారు. దసరా పండుగకు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి.
మరో విషయమేమిటంటే.. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవర్‌స్టార్‌పవన్ కల్యాణ్ పాడిన ‘కాటమరాయుడా’ పాట గుర్తుందా? ఇప్పుడు ఇదే తరహాలో ఈ కొత్త సినిమాలో కూడా ఓ పాట ఉండబోతోంది. పవన్‌కి జానపద గీతాలపై ఆసక్తి ఉండడంతో ఈ చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్ ‘కాటమరాయుడా’ లాంటి పాటను కంపోజ్ చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ పాటని హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారట. ‘కాటమరాయుడా’ పాట తరహాలోనే ఈ పాటనీ పవన్‌కల్యాణే పాడనున్నట్లు తెలుస్తోంది.
Post A Comment: