
సుకుమార్-రామ్‌చరణ్ కలయికలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న తాజా చిత్రానికి ‘రేపల్లె’ అనే పేరు ఖరారు చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్టు తెలిసింది. తెరపై రామ్‌చరణ్ రేపల్లె మొనగాడిగా సందడి చేయనున్నట్టు సమాచారం. ఇది 80వ దశకం నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతోందని ఓ ప్రచారం సాగుతోంది. అయితే చిత్రబృందం మాత్రం ఆ విషయాల్ని చాలా గోప్యంగా ఉంచుతోంది. సినిమాలో రామ్‌చరణ్ సరసన సమంత కథానాయికగా నటిస్తోంది. ఇందులో బుల్లితెర భామ అనసూయ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే సుదీర్ఘమైన షెడ్యూల్ జరుగుతుండడంతో చరణ్ అక్కడే బస చేస్తున్నారు. రామ్‌చరణ్‌తో పాటు ఆయన భార్య ఉపాసన కూడా పల్లెటూరి అందాల్ని ఆస్వాదిస్తూ గడుపుతున్నారు. ఈ చిత్రానికి రామ్‌చరణ్ సోదరి సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
Post A Comment: