గాయని సుచిత్ర ట్విటర్‌ ఖాతాలో 'సుచీ లీక్స్' పేరుతో పోస్ట్‌ అయిన తమిళ నటీ న‌టుల రహస్య వ్యవహారాలు ఓ మోస్తారు దుమారమే లేపాయి. అమె చేసిన పోస్ట్ లు నిజ‌మైన‌వా, నకిలీవా అన్న‌వి ఇంత వ‌ర‌కూ తేల‌లేదు. ఆ విషయంపై అప్పట్లో ఆమె భ‌ర్త ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తూ సుచిత్ర మాన‌సిక ప‌రిస్థితి స‌రిగా లేద‌ని, విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని పేర్క‌న్నాడు. ఆ తర్వాత సుచిత్ర ఎక్కడున్నారంటూ ఆమె శ్రేయోభిలాషులు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కొన్ని వెబ్‌సైట్లు ‘సుచిత్ర ఎక్కడున్నారు?’ అంటూ వార్తలు కూడా రాశాయి.

తాజాగా సుచిత్ర భర్త కార్తీక్‌ కుమార్‌ ఫేస్‌బుక్‌లో ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. ఆమె అమెరికాలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపాడు. తాను కొత్త కామెడీ స్పెషల్‌ను రాస్తున్నట్లు పేర్కొన్నారు. దీన్ని 2017 సెప్టెంబరులో విడుదల చేస్తున్నట్లు చెప్పారు. దీంతో ఇప్పుడు సుచిత్ర ఆచూకీపై క్లారిటీ వచ్చింది.

Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: