తమిళ బుల్లితెర నటి నందిని భర్త కార్తికేయన్ (30) విషం తీసుకుని ఆత్మహత్య చేసుకోవటం అంతటా సంచలనమైంది. పోలీసులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం సోమవారం రాత్రి చెన్నైలోని విరుంబాకంలోని ఓ లాడ్జీలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కూల్ డ్రింక్‌లో విషం తాగి సూసైడ్ చేసుకొన్నట్టు తెలిసింది. కార్తికేయన్ ఆత్మహత్యపై పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆయన మృతికి మామ కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
కార్తికేయన్ చెన్నైలో జిమ్‌ను నడుపుతున్నారు. మొదటి భార్య చనిపోవడంతో ఎనిమిది నెలల కిత్రం నందినిని వివాహం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొద్దిరోజుల కిత్రం జిమ్‌ను మూసేశారు. ఇటీవల నందిని నుంచి విడిపోయారు. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. లాడ్జి సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కార్తికేయన్ తన మరణానికి గల కారణాన్ని లేఖలో పేర్కొన్నారు.
విజయ్ టెలివిజన్‌లో 'శరవణన్ మీనాక్షీ' సీరియల్ ద్వారా నందిని సుపరిచితులు. ఆ తర్వాత 'మైనా' సీరియల్‌తో విశేష ప్రజాదరణను కూడగట్టుకొన్నారు. టెలివిజన్ సీరియల్స్ కాకుండా కొన్ని సినిమాల్లో కూడా నందిని నటించింది. 'వంశం', 'కేడి బిల్లా-కిలాడీ రంగా' చిత్రాల్లో కనిపించింది.
Post A Comment: