నిన్న ఆదివారం (ఏప్రిల్ 2) జరిగిన తమిళ చిత్ర పరిశ్రమ నిర్మాతల మండలి ఎన్నికల్లో స్టార్ హీరో, నిర్మాత విశాల్ గెలుపొంది మండలికి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఈ గెలుపుతో ఇప్పటికే నడిఘర్ సంగం జనరల్ సెక్రెటరీగా భాద్యతలు నిర్వర్తిస్తున్న విశాల్ తమిళ పరిశ్రమలోనే శక్తివంతమైన రెండు పదవులను చేపట్టినట్టైంది. ఉదయం 8: 30 గంటలకు మొదలై సాయంత్రం 4 గంటలకు ముగిసిన పోలింగ్ లో 1,059 ఓట్లు పోలవగా, విశాల్ తన ప్రత్యర్థి కోదండ రామయ్యపై 154 ఓట్ల తేడాతో గెలుపొందారు. విశాల్ జట్టులోని సభ్యులైన ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్ లు వైస్ ప్రెసిడెంట్లగాను, ఎస్సార్ ప్రభు ట్రెజరర్ గాను బాధ్యతలు చేపట్టారు.
విజయానంతరం విశాల్ మాట్లాడుతూ తమిళ పరిశ్రమలోని పైరసీపై గట్టి చర్యలు తీసుకుంటామని, రైతుల సమస్యలపై కూడా పనిచేస్తామని, రాబోయే రెండేళ్లు తమిళ పరిశ్రమకు మంచి రోజులని అన్నారు. ఈ ఎన్నికల్లో రజనీకాంత్, కమల్ హాసన్, రాధికా శరత్ కుమార్, సుహాసినీ మణిరత్నం, నాజర్ వంటి ప్రముఖులు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Post A Comment: