Tamil Movie News | Latest Tamil Cinema News | Kollywood Film News | Kollywood News | All Cinema News | Cinerangam.com

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘రోబో-2’ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఒక పాట మినహా మిగతా చిత్రీకరణ మొత్తం పూర్తయిపోయింది. వచ్చే నెల నుండి మొదలుకానున్న ఈ పాట షూటింగ్ 12 రోజుల పాటు నిర్విరామంగా జరుగుతుందట. ఇప్పటి వరకు ఏ పాట కూడా ఇన్ని రోజుల పాటు షూట్ జరుపుకోలేదు కాబట్టి అతి పెద్ద పాట చిత్రీకరణ రికార్డ్ కూడా రజనీ సినిమాకే దక్కింది. ఇన్ని రోజులపాటు చిత్రీకరణ జరుపుకోనున్న ఈ పాటను అవుట్ డోర్లో కాకుండా ఇండోర్ సెట్లోనే భారీ గ్రాఫికల్ వర్క్ తో రూపొందిస్తారట.

ఈ పాటలో రొమాన్స్ తో పాటు డాన్స్ ట్రాక్ కూడా ఉంటుందని, పాట శంకర్ స్టైల్లో గ్రాండ్ గా రూపొందనుందని హీరోయిన్ యామీ జాక్సన్ తెలిపారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ పాత్ర చేస్తుండగా ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 2010లో రిలీజైన ‘రోబో’ కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమాను 2018 జనవరి 25న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: