గత కొంత కాలంగా కథానాయకులకు పోటీగా నయనతార దూసుకెళుతున్నారు. ‘మాయా’, ‘డోరా’ వంటి కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుని నటిస్తున్నారు. మరోవైపు యువ హీరోలతో కూడా జోడీ కడుతున్నారు. ప్రస్తుతం ఆమె ‘వేలైక్కారన్’, ‘ఇమైకా నొడిగల్’, ‘కొలైయుదిర్ కాలం’, ‘అరం’ వంటి పలు సినిమాల్లో నటిస్తున్నారు. ఇవన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నవే. ఈ నేపథ్యంలో కథానాయిక నేపథ్యంలోని ‘కోకో’ అనే కొత్త సినిమాలో ఆమె నటించనున్నారు.
నెల్సన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో నయనతారకు జోడీ లేదు. డార్క్ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. సంగీతానికి ప్రాధాన్యత కలిగిన ఈ సినిమాకు అనిరుధ్ స్వరాలు సమకూర్చుతున్నారు. ఆగస్టు తొలి వారం నుంచి చిత్రీకరణ మొదలుకానుంది.
Post A Comment: