ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకుడు. ఈ చిత్రం పట్ల అన్ని పరిశ్రమల ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా ‘బాహుబలి’ తో బాలీవుడ్‌లో ప్రభాస్‌కు ఏర్పడిన భారీ మార్కెట్‌పై శ్రద్దపెట్టిన చిత్ర యూనిట్ అక్కడి ప్రేక్షకులకు లోకల్ సినిమా అనే ఫీలింగ్ కలిగేలా బాలీవుడ్ నటుల్ని ప్రాజెక్టులోకి తీసుకుంటోంది.ఇప్పటికే ఇందులో ప్రతినాయకుడి పాత్రలో నీల్ నితిన్ ముఖేష్ నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలో మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు చంకీ పాండే విలన్ పాత్రలో నటించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.
ఇకపోతే ఈ చిత్రాన్ని చాలా స్టైలిష్‌గా తెరకెక్కించబోతున్నట్లు టీజర్ ద్వారా దర్శకుడు సుజిత్ చెప్పకనే చెప్పాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో ప్రభాస్‌కు జోడీ ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈ చిత్రానికి శంకర్‌ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
Post A Comment: