ఈ ఏడాది ‘ఖైదీ నంబర్ 150’ చిత్రంతో ఘనమైన రీఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. త్వరలోనే ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రంలో నటించనున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. కథానాయికగా నయనతారను తీసుకోవాలని చిత్ర బృందం యోచిస్తోంది. చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం కావడంతో ఈ సినిమా టైటిల్ ప్రత్యేకంగా, అందరికీ చేరువయ్యేలా ఉంటే బాగుంటుందని చిత్ర బృందం భావిస్తోందట. ఇందులో భాగంగానే ‘మహావీర’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం.
ప్రస్తుతం ‘ఉయ్యాలవాడ’ చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు సురేందర్‌రెడ్డి ఈ చిత్రం స్క్రిప్ట్‌ను పక్కాగా సిద్ధం చేస్తున్నారట. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కథానాయకులను స్టైలిష్‌గా చూపించడంలో ఆరితేరిన సురేందర్‌రెడ్డి చారిత్రక నేపథ్యంలో చిత్రంలో చిరంజీవిని ఎలా చూపిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి చిత్రీకరణ ప్రారంభించిన రోజునే చిత్ర టైటిల్‌ను వెల్లడిస్తారో లేదో చూడాలి.
Post A Comment: