ప్రముఖ మలయాళీ నటుడు దిలీప్‌కుమార్‌ను సోమవారం పోలీసులు అరెస్ట్‌చేశారు. మలయాళీ నటి భావన అపహరణ, లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అరెస్టయిన దిలీప్‌కు న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. అయితే తాను అమాయకుడినని, అనవసరంగా ఇరికించారని దిలీప్ ఆరోపిస్తున్నారు. దిలీప్‌ని కోచికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలువా సబ్‌జైల్‌కు తరలించారు. దిలీప్‌ని 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. దిలీప్‌కు బెయిల్ ఇప్పించేందుకు అతని తరఫు న్యాయవాది రామ్‌కుమార్ ప్రయత్నిస్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో భావనను కారులో అపహరించి, అనంతరం లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన పెను సంచలనం సృష్టించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న కీలక వ్యక్తి పల్సర్ సునీల్ కుమార్‌ను కేరళ పోలీసులు ఏప్రిల్‌లోనే అరెస్టుచేశారు. అయితే, ఈ కేసులో లోతైన దర్యాప్తులో భాగంగా గత వారమే దర్శకుడు నాదిర్షా, నటుడు దిలీప్‌కుమార్‌లను పోలీసులు సుమారు 13 గంటల పాటు విచారించారు. దిలీప్ ను అరెస్టు చేయడం ద్వారా పల్సర్ సుని గ్యాంగ్ తో అతడే ఈ దారుణం చేయించాడని పోలీసులు ఒక నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తోంది. దిలీప్‌కు, భావనకు కొన్ని పాత గొడవలు ఉన్నాయి. ఆ కక్షతోనే దిలీప్ ఇదంతా చేయించినట్లు అనుమానిస్తున్నారు. దిలీప్‌కుమార్ అరెస్టుపై డీజీపీ స్పందిస్తూ.. ఈ కేసు దర్యాప్తు బృందం పూర్తి ఆధారాలు సేకరించాకే ఆయనను అరెస్టు చేసినట్టు చెప్పారు.
Post A Comment: