అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్నకొత్త చిత్రం ‘నా పేరు సూర్య’. ‘నా ఇల్లు ఇండియా’ అనేది ఉపశీర్షిక. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇదివరకే లాంఛనంగా ప్రారంభమైంది. వచ్చే నెల తొలి వారం నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలుపెట్టబోతున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా అను ఇమ్మాన్యుయెల్ నటిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు ఆదివారం ప్రకటించారు. ‘మజ్ను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అను ఇమ్మాన్యుయేల్ ప్రస్తుతం పవన్ – త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది.
దేశభక్తి నైపథ్యంలో రూపొందనున్న ‘నా పేరు సూర్య’. ‘నా ఇల్లు ఇండియా’ సినిమాను ఆగష్టు మొదటి వారం నుండి మొదలుపెట్టనున్నారు. 2018 సంక్రాంతికి విడుదలకానున్న ఈ సినిమాకు విశాల్ – శేఖర్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ సినిమాటోగ్రఫర్ రాజీవ్ రవి కెమెరా వర్క్ చేయనున్నారు.
అల్లు అర్జున్ ఇటీవల ‘దువ్వాడ జగన్నాథం’గా ప్రేక్షకుల ముందుకొచ్చి వినోదాన్ని పంచారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లు రాబట్టినట్లు 'డీజే' చిత్ర బృందం పేర్కొంది. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించారు. ఈ చిత్రంలో బన్ని బ్రాహ్మణ యువకుడిగా కొత్త గెటప్‌లో కనిపించి అలరించారు.
Post A Comment: