మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సుమారు 25 రోజుల పాటు జరగబోయే మలేషియా షెడ్యూల్ కు సిద్ధమవుతోందని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘విష్ణు-బ్రహ్మానందం కాంబినేషన్ బాగా నవ్విస్తుంది. మల్లిడి వెంకటకృష్ణమూర్తి ఆద్యంతం అలరించేలా ఒక మంచి కథను సమకూర్చారు. ప్రస్తుతం మలేషియా షెడ్యూల్‌లో ఎక్కువ మంచి ఆర్టిస్టులతో హాస్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్ అనంతరం టీం మొత్తం అమెరికా వెళ్లనున్నాం. అక్కడ కీలక షెడ్యూల్ ప్లాన్ చేశాం’ అన్నారు.
విష్ణు సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు బ్రహ్మానందం ముఖ్య భూమిక పోషిస్తున్నారు. నిర్మాత ఎమ్. ఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. ‘దేనికైనా రెడీ’, ‘ఈడోరకం ఆడోరకం’ తర్వాత విష్ణు-నాగేశ్వరరెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూడో చిత్రమిది. చాన్నాళ్ళుగా కెరీర్లో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న మంచు విష్ణుకు ఈ సినిమాతో తప్పకుండా సక్సెస్ దొరుకుతుందని చిత్ర సన్నిహిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సినిమా మాత్రమే గాక జి.ఎస్. కార్తీక్ దర్శకత్వంలో ‘ఓటర్’ అనే మరొక సినిమా సైతం చేస్తున్నాడు విష్ణు.
Post A Comment: