దాదాపు దశాబ్దకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘ఖైదీ నంబర్ 150’తో ఘనంగా పునరాగమనం చేశారు. ప్రస్తుతం, స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న తన 151వ చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇందులో చిరంజీవికి జోడీగా నయనతార ఎంపికైంది. ఈ సినిమాకి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీ దాదాపు పూర్తి కాగా హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు వంటి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
‘ఖైదీ నెం 150’ విజయం తర్వాత చిరు చేస్తున్న ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో అని తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఒక స్వాతంత్ర్య సమరయోధుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందనుంది కాబట్టి ఆగష్టు 15 స్వాతంత్ర్యదినోత్సవం రోజున లాంచ్ చేస్తే బాగుంటుందని మెగా టీమ్ భావిస్తోందనే శుభవార్త బయటికొచ్చింది. ఇకపోతే ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ స్వయంగా నిర్మించనుండగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
Post A Comment: