పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌కి వీరాభిమాని నితిన్. తన ప్రతి సినిమాలోనూ ఏదో రకంగా, ఎక్కడో ఒక్కచోట పవన్ పేరును ప్రస్తావిస్తూ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటాడు. కొన్ని చిత్రాల్లో అయితే పవన్ పాటల్ని కూడా రీమిక్స్ చేసి పాడుకొన్నాడు. అదంతా పవన్ కల్యాణ్ అభిమానులకి ఎంతగానో నచ్చింది. ఇప్పుడైతే ఏకంగా పవన్ సినిమా పేరునే కొంచెం మార్చి తన సినిమా కోసం వాడుకోనున్నట్టు ప్రచారం సాగుతోంది. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఈ సినిమా పేరునే కాస్త మార్చి ‘అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి’ గా నితిన్ సినిమాకి ఖరారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
త్రివిక్రమ్, సుధాకర్‌రెడ్డిలతో కలిసి పవన్‌కల్యాణ్ నిర్మిస్తున్న సినిమా విషయంలోనే ఆ పేరు ప్రచారంలోకి రావడం విశేషం. కృష్ణచైతన్య దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.
Post A Comment: