పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. ఎస్.రాధాకృష్ణ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. పవన్ కల్యాణ్‌తో పాటు, ఇతర చిత్రబృందంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. తదుపరి షెడ్యూల్ కోసం చిత్రబృందం త్వరలోనే యూరప్ వెళ్లనుంది. యూరప్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాలో చాలానే ఉంటాయట. ఆ సన్నివేశాల చిత్రీకరణ కోసం చిత్రబృందం అక్కడికి పయనమవుతోంది.
పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ కలయికలో ఇది వరకు వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలోనూ యూరప్ నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు మరోమారు పవన్ కల్యాణ్ అక్కడే హంగామా చేస్తారన్నమాట. అక్కడ సన్నివేశాలతో పాటు కొన్ని పాటలు కూడా చిత్రీకరించబోతున్నారు. పవన్ కల్యాణ్ ఈ సినిమాలో ఐటీ నిపుణుడి పాత్రని పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తున్న ఆది పినిశెట్టి కూడా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వాహకుడిగా తెరపై కనిపించబోతున్నాడు. ‘అత్తారింటికి దారేది’లో పవన్‌కల్యాణ్ తాతగా నటించిన బొమన్ ఇరానీ ఇందులో కూడా ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. అలాగే ఆ సినిమాలో నదియా పాత్రని పోలిన ఓ శక్తివంతమైన పాత్రని ఇందులో ఖుష్బు చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు.
Post A Comment: