నటుడిగానే కాకుండా గాయకుడిగానూ తన ప్రతిభను నిరూపించుకున్నారు పవన్‌కల్యాణ్. గతంలో పలు చిత్రాల్లో ఆయన పాటలు పాడినా, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో పాడిన ‘కాటమరాయుడా.. కదిరి నరసింహుడా’ సాంగ్ పెద్ద హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి పవన్‌కల్యాణ్ తన గాత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యారు.
పవన్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో పవనకల్యాణ్ ఓ పాట పాడనున్నారని సమాచారం. ‘కాటమరాయుడా..’ స్థాయిలో ఈ పాట కూడా అలరిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. ఇక ఈ సినిమాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పవన్ పాత్ర సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాల తర్వాత పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంలో భారీ అంచనాలు ఉన్నాయి. హారికా హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Post A Comment: