Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

యంగ్ హీరో సుందీప్ కిషన్ ప్రస్తుతం సుమారు మూడు వరకు కొత్త సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాల్లో మహేష్ బాబు సోదరి మంజుల తొలిసారి, మెగా ఫోన్ పడుతూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కూడా ఒకటి. మే నెలలో ప్రారంభమైన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్ర యూనిట్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో చిత్రీకరణ జరుపుతున్నారు. సందీప్ కిషన్ పూర్తిగా కొత్త లుక్ లో స్టైలిష్ గా కనిపించనున్న ఈ చిత్రం పూర్తి స్థాయి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది. ఆనంది ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై జెమినీ కిరణ్, మంజులలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన త్రిదా చౌదరి, అమైరా దస్తూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: