ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం‘ స్పైడర్’. చిత్రీకరణ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రంలో మిగిలిన ఓ పాట చిత్రీకరణ కోసం త్వరలో విదేశాలకు వెళ్లబోతోంది. ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్‌లో ఈ ఆఖరు గీతాన్ని చిత్రీకరించడంతో సినిమా షూటింగ్ పూర్తికానున్నట్లు సమాచారం. మరో వైపు ఈ చిత్రం యొక్క నిర్మాణానంతర కార్యక్రమాలు జరగుతున్నాయి. హెవీ యాక్షన్ సీక్వెన్సులు, రోబోటిక్ స్పైడర్ ఉండటం వలన వాటి కోసం అత్యాధునిక సాంకేతికతతో, నిపుణులతో వి.ఎఫ్. ఎక్స్ పనులు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తయ్యేనాటికి సెప్టెంబర్ అవుతుందని తెలుస్తోంది. అందుకే విడుదల తేదీని కూడా సెప్టెంబర్ 27 కు నిర్ణయించారు.
ఇటీవల విడుదల చేసిన చిత్రం టీజర్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. త్వరలో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా కనిపించనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎస్.జె సూర్య, భరత్ లు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. హరీశ్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
Post A Comment: