మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’. 'ఖైదీ నంబర్ 150' తర్వాత చిరు నటిస్తున్న చిత్రమిది. ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్రను యూనిట్ సంప్రదించినట్లు సమాచారం. మరి ఉపేంద్ర దీనికి ఒప్పుకున్నారో లేదో? అనే విషయం చిత్ర యూనిట్ ప్రకటించాల్సి ఉంది. 2015లో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్ర పోషించి మెప్పించిన సంగతి తెలిసిందే. ‘ఉయ్యాలవాడ’లో చిరుకు జోడీగా నయనతార నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఆగస్టు 22న చిరు పుట్టినరోజు సందర్భంగా దీనికి కొబ్బరికాయ కొట్టే అవకాశం ఉంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Post A Comment: