మెగాస్టార్ చిరంజీవి కమ్‌బ్యాక్ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ ని తెరకెక్కించి మరోసారి టాప్ దర్శకుల జాబితాలో చేరిన వి. వి. వినాయక్ లాంగ్ గ్యాప్ తర్వాత తన కొత్త చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. అది కూడా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కావడం విశేషం. ఈ ప్రాజెక్ట్ విషయం బయటకురాగానే మాస్ హీరోగా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్న సాయి ధరమ్ కు ఈ చిత్రం బాగా సహకరిస్తుందని అంతా అభిప్రాయపడ్డారు.
ఇకపోతే గత కొన్నిరోజులుగా ఈ సినిమాకు ‘దుర్గ’ అనే టైటిల్ ను నిర్ణయించినట్టు వార్తలొచ్చాయి. వీటిపై స్పందించిన వినాయక్ అది సినిమా టైటిల్ కాదని, ఇంకా టైటిల్ గురించి ఆలోచించలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రముఖ రచయిత ఆకుల శివ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా పరుచూరి బ్రదర్స్, సత్యానంద్ లు స్క్రీన్ ప్లే మీద వర్క్ చేస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది, నటీనటులెవరు అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Post A Comment: