తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ మరోసారి 'కింగ్ ఆఫ్ ద ఓపెనింగ్' అనిపించుకున్నారు. ఆయన నటించిన చిత్రం ‘వివేకం’. కాజల్ అగర్వాల్, వివేక్ ఓబెరాయ్, అక్షర హాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. శివ దర్శకత్వం వహించగా సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలుగా వ్యవహరించారు. అనిరుధ్ స్వరాలు అందించారు. గురువారం (ఆగస్టు 24) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి టాక్ అందుకుంది.
కాగా ఈ చిత్రం తొలిరోజున చెన్నై సిటీ బాక్సాఫీసు వద్ద వసూళ్ల దుమ్మురేపింది. ఇప్పటి వరకు ఓపెనింగ్స్‌లో ముందున్న రజనీకాంత్ ‘కబాలి’, విజయ్ ‘తెరి’ చిత్రాల రికార్డులను (కేవలం చెన్నై సిటీ బాక్సాఫీసు వద్ద) ‘వివేకం’ వెనక్కినెట్టి.. రూ. 1.21 కోట్లు రాబట్టిందని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో అజిత్ కింగ్ ఆఫ్ ఓపెనింగ్ అని నిరూపించుకున్నారని అన్నారు. ఓపెనింగ్ రోజున ‘కబాలి’ రూ. 1.12 కోట్లు, ‘తెరి’ రూ. 1.05 కోట్లు రాబట్టాయి.
‘వివేకం’ అమెరికా బాక్సాఫీసు వద్ద బుధవారం నిర్వహించిన ప్రీమియర్‌లో రూ. 1.37 కోట్లు రాబట్టి.. 15వ స్థానంలో నిలిచిందని విశ్లేషకులు చెప్పారు. తొలి రోజున (గురువారం) అమెరికాలో రూ. 1.57 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు.
Post A Comment: