Hollywood Movie News | Latest Hollywood Cinema News | Hollywood Film News | Hollywood News | All Cinema News | Cinerangam.com

హాలీవుడ్‌ సినిమాల్లో జేమ్స్‌బాండ్‌ చిత్రాలకున్న ఆదరణ వేరు. ఇప్పటివరకు జేమ్స్‌బాండ్‌ సిరీస్‌లో ఎన్నో చిత్రాలొచ్చాయి. ఎంతోమంది నటులు బాండ్‌లుగా అలరించారు. ‘క్యాసినో రాయల్‌’, ‘క్వాంటమ్‌ ఆఫ్‌ సొలేస్‌’, ‘స్కైఫాల్‌’, ‘స్పెక్టర్‌’... ఈ నాలుగు బాండ్‌ సినిమాల్లోనూ తనదైన స్టైల్‌తో నటించి మెప్పించాడు డేనియల్‌ క్రెగ్‌. ఆ మధ్య ఒక సందర్భంలో ఈ చిత్రం తర్వాత ఇకపై బాండ్‌ చిత్రాల్లో నటించనని చెప్పి తన అభిమానుల్ని నిరాశపరిచాడు. మెట్రో గోల్డ్‌ వైన్‌ మేయర్‌, ఎవోన్‌ ప్రొడక్షన్స్ సంస్థలు జేమ్స్‌బాండ్‌ 25వ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. కానీ బాండ్‌ పాత్రలో ఎవరు నటిస్తారనేది ప్రకటించలేదు.

తాజాగా ఈ చిత్రంలో బాండ్‌గా నటించేది తనే అని డేనియల్‌ క్రేగ్‌ ప్రకటించాడు. ఇటీవల ‘ది లేట్‌ షో విత్‌ స్టీఫెన్‌ కోల్‌బెర్ట్‌’ టీవీ షోలో పాల్గొన్నాడు డేనియల్‌ క్రేగ్‌. ఇందులో షో హోస్ట్‌ కోల్‌బెర్ట్‌ ‘‘మీరు మళ్లీ ఏజెంట్‌ 007 కనిపిస్తారా?’’అని అడిగితే ‘అవును’ అని సమాధానం చెప్పాడు క్రెగ్‌. కొన్ని నెలల్లోనే జేమ్స్‌బాండ్‌గా మళ్లీ కనిపించనున్నట్లు చెప్పాడు క్రెగ్‌. ఇంకా ‘‘ప్రస్తుతం ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే మిగలిన విషయాలు వెల్లడవుతాయ’’ని ఆయన చెప్పారు. ‘ఇకపై బాండ్‌గా నటించను’ అని గతంలో చెప్పిన దానికి స్పందిస్తూ ‘‘అదొక పిచ్చి సమాధానం’’ అని చెప్పాడు డేనియల్‌.

Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: