పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్‌బాబు కథానాయకుడిగా నటిస్తూ తమ సొంత నిర్మాణ సంస్థ శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘గాయత్రి’. గత శుక్రవారం (28 జూలై 2017) హైదరాబాద్‌లో ఈ సినిమా నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టారు. చిత్రం తదుపరి షెడ్యూల్‌లో భాగంగా తిరుపతి సమీపంలోని మండల కేంద్రమైన చంద్రగిరి రెవెన్యూ కార్యాలయ ఆవరణలో శనివారం (05 ఆగస్టు 2017) మధ్యాహ్నం కొన్ని హాస్య సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మదన్ నటులు ఆలీ, గీతాసింగ్, అనసూయకు సన్నివేశాలు వివరించారు. అన్ని సన్నివేశాలు సింగిల్‌టేక్‌లో చిత్రీకరించారు.
దర్శకుడు మదన్ మాట్లాడుతూ ఆగస్టు 24 వరకు చంద్రగిరి, తిరుపతి పరిసర గ్రామాల్లో కథానాయకుడు మోహన్‌బాబుతో పాటు ఆలీ, గీతాసింగ్, అనసూయ, రఘుబాబుపై చిత్రీకరణ కొనసాగుతుందన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సర్వేష్ మురారి, సంగీతం తమన్, కళ చిన్నా, కూర్పు శేఖర్ అందిస్తున్నారు.
Post A Comment: