తమిళ నటుడు ప్రభు నటించిన ‘వేలై కిడైచ్చిరుచ్చు’ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేశారు మన్సూర్ అలీఖాన్. విజయ్‌కాంత్ నటించిన ‘కెప్టెన్ ప్రభాకరణ్’ చిత్రంతో గుర్తింపు సాధించారు. 250 పైగా చిత్రాల్లో నటించి అందరినీ మెప్పించారు. ప్రస్తుతం ఆయన కుమారుడు అలీఖాన్ తుగ్లక్ హీరోగా పరిచయమవుతున్నారు. తన సొంత నిర్మాణమైన రాజ్‌కెన్నడి ఫిలిమ్స్ బ్యానరుపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మన్సూర్ అలీఖాన్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ‘కడమాన్‌పారై’ అని పేరు పెట్టారు. అనురాఘవి, జెనీ ఫెర్నాండెజ్ కథానాయికలుగా నటిస్తున్నారు.
మహేష్ సినిమాటో గ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రవివర్మ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ సినిమా గురించి మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో జరిగే ఓ ఉత్సవం, నగరంలో చోటుచేసుకునే భూకంపం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఆంధ్రాలోని అటవీ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. ఇది పక్కా కమర్షియల్ చిత్రం. తుగ్లక్‌కు ఇది మంచి గుర్తింపునిస్తుందని పేర్కొన్నారు.
Post A Comment: