బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను నిర్మాత కరణ్‌ జోహార్ విడుదల చేసారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో టైటిల్‌పై టైగర్‌ స్టైల్‌గా పడుకున్నట్లుగా చూపించారు. పునిత్‌ మల్హోత్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2012లో వచ్చిన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’కి ఇది సీక్వెల్‌గా రాబోతోంది. ఈ చిత్రంలో వరుణ్‌ ధావన్‌, సిద్దార్థ్‌ మల్హోత్రా, ఆలియా భట్‌ నటించారు.ఇప్పుడు ఈ సీక్వెల్‌లో టైగర్‌కి జోడీగా ఎవరు నటిస్తున్నారన్నది ఇంకా వెల్లడించలేదు.

తొలి సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన కరణ్‌ జోహారే ఈ చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫాక్స్‌స్టార్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 2018 నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుంది.

Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: