Tamil Movies Box Office News | Latest Tamil Cinemas Box Office News | Kollywood Films Box Office News | Kollywood Box Office News | All Cinemas Box Office News | Cinerangam.com

మిళ స్టార్‌ కార్తి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఖాకి’. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని ‘తీరన్‌ అధిగారమ్‌ ఒండ్రు’ టైటిల్‌తో తమిళ భాషలో విడుదల చేశారు. శుక్రవారం (నవంబరు 18) విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంది. కాగా తమిళనాడు బాక్సాఫీసు వద్ద ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోందని విశ్లేషకులు పేర్కొన్నారు. వారాంతానికి మొత్తం రూ.10.35 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు. సిద్ధార్థ్‌ ‘అవల్‌’, నయనతార ‘అరాం’, విజయ్‌ ‘మెర్సల్‌’ తర్వాత చెన్నై బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లతో రాణిస్తున్న నాలుగో చిత్రమిదని సమాచారం.

ఖాకి’ చిత్రంలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటించారు. వినోద్‌ దర్శకుడు. ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు నిర్మాతలుగా వ్యవహరించారు. జిబ్రాన్‌ స్వరాలు సమకూర్చారు. 90దశకంలో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో కార్తి పోలీసు అధికారి పాత్రలో కనిపించి, మెప్పించారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: