అక్కినేని నాగార్జున, రామ్‌గోపాల్ వర్మ కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టుడియోలోని గ్లాస్ హౌస్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చైన్ సెట్‌లో నాగార్జునపై తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. రామ్ గోపాల్ వర్మ తల్లి సూర్యమ్మ తొలిషాట్ కు క్లాప్ కొట్టగా.. నాగార్జున ‘నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా నేను నిన్ను చంపటం గ్యారంటీ. ఎంత తొందరగా చెప్తే అంత తొందరగా చస్తావ్ తక్కువ నొప్పితో చస్తావా ఎక్కువ నొప్పితో చస్తావా.. చూజ్’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి సినిమాను ప్రారంభించారు.
ఈ ఓపెనింగ్ చూడ్డానికి భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ’28 ఏళ్లకు మెచ్యూరిటీ వస్తుందని నాన్న అనేవారు, నాకు 28 ఏళ్ళకు శివ సినిమా చేశాను. మళ్ళీ ఇప్పుడు 28 ఏళ్ళ తర్వాత డబుల్ మెచ్యురిటీతో వర్మతో కలిసి మళ్ళీ సినిమా చేస్తున్నాను’ అన్నారు.
తన తొలి చిత్రం ‘శివ’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అక్కినేని నాగేశ్వరరావు, తన తండ్రి హాజరయ్యారని.. ఇప్పుడు నాగార్జునతో తీయబోయే చిత్రానికి తన తల్లి సూర్యమ్మ, నిర్మాతలు అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర అతిథులుగా హాజరవుతారని రామ్‌గోపాల్ వర్మ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభానికి ముందు వర్మ ఈ చిత్రానికి సంబంధించిన ఓ కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో బల్లపై పోలీస్ టోపీ, చాయ్, తుపాకీ ఉన్నాయి. వాటిపైన రామ్‌గోపాల్ వర్మ, అక్కినేని నాగార్జున, షూటింగ్ మొదలు అని రాసుండడం సినిమాపై మరింత ఆసక్తిని కలిగించింది.
ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో తన లుక్‌ని నాగార్జున సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ఈ లుక్‌లో నాగ్ ఆకట్టుకుంటున్నారు. ఒక చేతిలో తుపాకి మరో చేతిలో డబ్బు కట్టలతో ఉన్న నాగ్ స్టిల్ హైలైట్‌గా నిలిచింది.
28 years ago a film called shiva changed my life and now again another film/what I’m feeling now is something I cannot describe! I only wish that life was so exciting every day👍 #NagRGV4 pic.twitter.com/LxRnQuO0Hv— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 20, 2017
Post A Comment: