Hindi Movie News | Latest Hindi Cinema News | Bollywood Film News | Bollywood News | All Cinema News | Cinerangam.com

బాలీవుడ్‌ నటి సన్నీ లియోనీని ఆమె బృందంలోని ఓ వ్యక్తి ఆటపట్టించారు. సన్నీ సెట్‌లో కూర్చొని ఏదో చదువుకుంటుండగా ఆమెపైకి రబ్బరు పాము విసిరారు. సన్నీకి తెలియకుండా ఆమె వెనుక నుంచి వెళ్లి భుజంపై దాన్ని వదిలారు. ఇక అంతే పామును చూసిన సన్నీ ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. కంగారుగాపైకి లేచి, గెంతులేసి, పామును పక్కకు విసిరేశారు. ఆ వ్యక్తి పని పట్టడానికి అతడి వెంట పరుగు తీశారు. భయపడ్డ అతడు కూడా ఆమెకు అందకుండా ఉండాలని అక్కడి నుంచి పరిగెత్తారు.
ఆ తర్వాత సన్నీ లియోని కూడా తనని బయపెట్టిన ఆ వ్యక్తిపై సరదాగా ప్రతీకారం తీర్చుకున్నారు. రెండు చేతులతో కేకులని పట్టుకుని అతని వెనకనుంచి వెళ్ళి చెంపలపై కొట్టేసి అక్కడనుంచి పరిగెత్తింది. చాలా సరదాగా ఉన్న ఈ రెండు వీడియోలు నవ్వులు పూయిస్తున్నాయి.
సన్ని ప్రస్తుతం తన తర్వాతి చిత్రం ‘తేరా ఇంతెజార్‌’ ప్రచారంలో బిజీగా ఉన్నారు. రాజీవ్‌ వాలియా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. డిసెంబరు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల డా.రాజశేఖర్‌ నటించిన ‘గరుడవేగ’ చిత్రంలోని ‘డియో డియో’ ప్రత్యేక గీతంలో సన్నీ ఆడిపాడారు. ఈ పాటకు మంచి పాపులారిటీ వచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: