సీనియర్ నటుడు చిన్నా కుమార్తె మోనిక వివాహం చైతన్యతో వేడుకగా జరిగింది. తిరుమల పుణ్యక్షేత్రంలోని కర్ణాటక కల్యాణ మండపంలో ఈ పెళ్లితంతును నిర్వహించారు. శుక్రవారం (24 నవంబర్) తెల్లవారుజామున ఈ శుభకార్యం సంప్రదాయబద్ధంగా జరిగింది. పెళ్లికి ముందు రోజు రాత్రి రిసెప్షన్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ పెళ్లిలో తీసిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ సినిమాతో చిన్నా మంచి పేరు తెచ్చుకున్నారు. అందులో ఆయన పాత్ర పేరు చిన్నా కావడంతో ఆ పేరుతోనే సినీ పరిశ్రమలో కొనసాగారు. ఆయన అసలు పేరు జితేందర్‌రెడ్డి. ‘శివ’ తర్వాత పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. సుదీర్ఘ విరామం తర్వాత 2015లో వచ్చిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’లో నటించి మెప్పించారు. ఇటీవలే చిన్నా సతీమణి శిరీష కన్నుమూశారు. ఈ వివాహంతో ఆ విషాదం నుంచి కుటుంబ సభ్యులు కాస్త వూరట చెందారు.
Post A Comment: