ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు నీరజ్ వోరా(54) కన్నుమూశారు. 2016లో గుండెపోటు రావడంతో నీరజ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ తగిలింది. ఆ సమయంలో దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లిపోయారు. కొంతకాలం తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో మార్చిలో ముంబయికి తీసుకొచ్చారు. వోరాను ఆయన స్నేహితుడు ఫిరోజ్ నదియాద్‌వాలా తన ఇంట్లో పెట్టుకుని చికిత్స అందించారు. మళ్ళీ వారం రోజుల కిత్రం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు (14 డిశంబర్ 2017) తెల్లవారుజామున 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.
‘వెల్‌కం బ్యాక్’, ‘బోల్‌బచ్చన్’, ‘ధడకన్’ తదితర చిత్రాల్లో వోరా చిన్న పాత్రల్లో నటించారు. ‘ఖిలాడి420’, ‘గోల్‌మాల్’ చిత్రాలకు రచయితగా పనిచేశారు. వోరా మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Post A Comment: