భారతీయ వెండితెరపై మరో అడ్వెంచర్‌ డ్రామా ఫిల్మ్‌ ప్రేక్షకులను త్వరలో అలరించేందుకు సిద్ధమవుతోంది. కమలేశ్వర్‌ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బెంగాలీ చిత్రం ‘అమెజాన్‌ ఓబిజాన్‌’. తెలుగులో ‘అమెజాన్‌ అడ్వెంచర్‌’ పేరుతో విడుదల చేయనున్నారు. కేవలం హాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన ఇలాంటి జోనర్‌ చిత్రాన్ని బెంగాలీలో తెరకెక్కించడం విశేషం. అంతే కాదు.. దీనిని హిందీ, తెలుగు, తమిళ్‌, ఒరియా, అస్సామీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు.

నవంబర్‌ 30న విడుదలైన ఈ ట్రైలర్‌(బెంగాలీ) అతి తక్కువ సమయంలోనే 5మిలియన్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. ‘మా నాన్నగారు ఒక అన్వేషకుడు కావాలని కలలుగన్నారు. కానీ, ఆయన అన్వేషణ విఫలమైంది’ అంటూ ఓ మహిళ వాయిస్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ ఆకట్టుకుంది. బంగారు న‌గ‌రం కోసం క‌థానాయ‌కుడు చేసిన అన్వేష‌ణ ఫ‌లించిందా? అతను ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎస్‌బీఎఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మహేంద్రసోని, శ్రీకాంత్‌ మెహతా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: