తెలుగు సినిమా ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తి చేసిన చిత్రం ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1600 కోట్లను వసూలు చేసింది. అప్పటి వరకు ఉన్న టాప్ హిందీ సినిమా రికార్డులన్నింటినీ చెరిపేసిన ఈ సినిమా కొత్త చరిత్రను సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాను జపాన్ లో కూడా రిలీజ్ చేయనున్నారు. అక్కడి అధికారులు ఈ సినిమాకు ‘జి’ రేటింగ్ ఇచ్చారు. ‘జి’ అనగా మన క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ తో సమానం.
డిసెంబర్ 29 న ఈ జపనీస్ వెర్షన్ రిలీజ్ కానుంది. ఒక జపాన్ లోనే కాక చైనా, కొరియాలలో కూడా సినిమా విడుదలకానుంది. మరి ఈ సినిమా ఇతర దేశాల్లో ఎలాంటి రికార్డుల్ని సృష్టిస్తుందో వేచి చూడాలి.
Post A Comment: