ప్రముఖ తెలుగు హాస్యనటుడు విజయ్‌సాయి ఈ రోజు ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. యూసఫ్‌గూడలోని తన ఫ్లాట్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులే విజయ్ సాయి మృతికి కారణమని ఆయన సన్నిహితులు చెబుతుండగా.. భార్యతో కలహాల వల్లే ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. భర్త మరణవార్త తెలుసుకుని ఆయన భార్య వనిత సోమవారం మధ్యాహ్నం ఉస్మానియా ఆస్పత్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
‘విజయ్‌కు వేరే అమ్మాయితో సంబంధం ఉంది. ఆ విషయం నేను కళ్లారా చూశాకే విడాకులు అడిగాను. సంపాదనంతా అమ్మాయిలకే ఖర్చు చేసేవాడు. ఇలాంటివి వద్దని మనిద్దరం సంతోషంగా ఉందామని చెప్పినా అతడు వినలేదు. విజయ్ ప్రవర్తన గురించి అత్తమామలకు చెప్పినా పట్టించుకోలేదు. విజయ్ నన్నెప్పుడూ మంచిగా చూసుకోలేదు. నన్ను చిత్రహింసలు పెట్టాడు. నేనెప్పుడూ బయటకు వచ్చి చెప్పుకోలేదు. విజయ్‌ను నేను డబ్బులు డిమాండ్ చేయలేదు. నా కూతురు వారంలో 2 రోజులు తండ్రి దగ్గర ఉండాలని కోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు నా కూతుర్ని తీసుకెళ్లాడు. పాపను తీసుకునేందుకు వెళ్లినప్పుడు నన్ను కొట్టాడు. నావైపు నుంచి ఎలాంటి తప్పులేదు. విజయ్ ఇప్పటికిప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియద’ని అన్నారు.
అలాగే.. తానెప్పడు తన భర్తను ఇబ్బంది పెట్టలేదని, రెండేళ్లుగా తమ విడాకుల కేసు కోర్టులో ఉందని వెల్లడించారు. తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగులో ‘అమ్మాయిలు అబ్బాయిలు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సాయి.. అనంతరం ‘కరెంట్’, ‘వరప్రసాద్ పొట్టిప్రసాద్’, ‘బొమ్మరిల్లు’, ‘ఒకరికి ఒకరు’, ‘బృందావనం’, ‘మిస్టర్ మన్మధ’ తదితర చిత్రాల్లో నటించారు. ఆయన ఆఖరిగా నటించిన చిత్రం ‘ధనలక్ష్మి తలుపు తడితే’. 2015లో ఈ చిత్రం విడుదలైంది. చాలా సినిమాల్లో ప్రేక్షకుల్ని నవ్వించిన విజయ్ సాయి.. ఇలా ఊహించని విధంగా సుదూర దూరాలకు తరలివెళ్లడం, ఆత్మహత్యకి పాల్పడడం టాలీవుడ్‌ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు విస్మయాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సినీరంగం కోరుకుంటోంది.
Post A Comment: