Hindi Movie News | Latest Hindi Cinema News | Bollywood Film News | Bollywood News | All Cinema News | Cinerangam.com

సినిమా అనేది ఓ సాంకేతిక మాయా ప్రపంచం. దర్శకుడు ఎలాంటి దృశ్యాలను కోరుకున్నా సరే అబ్రకదబ్ర అంటూ మేజిక్‌ చేసినట్లు సెట్లు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ సాయంతో ఇట్టే ఆవిష్కరిస్తుంటారు కళాదర్శకులు, సీజీ నిపుణులు. ఇప్పుడు ఈ సినిమా కోసం భారీ వరదలే సృష్టించబోతున్నారు. కొన్నేళ్ల క్రితం ఉత్తరాఖండ్‌ను అతలాకుతలం చేసిన వరద బీభత్సం గుర్తుంది కదా. ఆ దుర్ఘటన నేపథ్యంలో బాలీవుడ్‌లో ‘కేదార్‌నాథ్‌’ అనే చిత్రం తెరకెక్కబోతోంది. యువకథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అతని సరసన సైఫ్‌ అలీఖాన్‌ గారాలపట్టి సారా అలీఖాన్‌ నాయికగా పరిచయమవుతోంది.

అభిషేక్‌ కపూర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం వరద ప్రమాద దృశ్యాలను త్వరలో చిత్రీకరించబోతున్నారు. ఇందుకోసం ముంబయిలోని ఓ స్టూడియోలోనే కేదార్‌నాథ్‌ పట్టణాన్ని సృష్టించేశారు. పట్టణంలోని వీధులతో పాటు ప్రధాన ఆలయం సెట్లను రూపొందించారట. ఇక వదరలు పుట్టించడమే తరువాయి. దీని కోసం భారీ ఎత్తున వాటర్‌ ట్యాంకర్లను, వందలమంది ఆర్టిస్టులను వినియోగించనున్నారట. ఈ సన్నివేశాల కోసం ఏకంగా రూ.7 కోట్లు ఖర్చు పెడుతుండటం గమనార్హం.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: