Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

తెలుగు సినిమా గర్వించదగ్గ అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహానటి’. 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్రంతో దర్శకుడిగా మారిన నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. కీర్తి సురేశ్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కాగా ‘మహానటి’ చిత్ర బృందం నుంచి సర్‌ప్రైజ్‌ వచ్చింది. బుధవారం సావిత్రి జయంతి సందర్భంగా చిత్ర బృందం టైటిల్‌ లోగోకు సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.

ఇందులో ‘మాయాబజార్‌’లోని పేటికను చూపించారు. దాన్ని ఓ మహిళ తెరిచారు. అందులోంచి ‘మహానటి’ అనే టైటిల్‌ బయటికి వచ్చింది. ఈ సన్నివేశాన్ని పక్కన పెడితే బ్యాక్‌గ్రౌండ్‌లో.. ‘అది ప్రియదర్శిని వదినా.. ఆ పేటిక తెరిచి చూస్తే అందులో ఎవరి ప్రియ వస్తువు వారికి కనిపిస్తుంది, మీకు పెళ్లైందా.. అయితే నన్ను చేసుకుంటారా?, అయ్యోరామ, నమో కృష్ణ, అలిగిన వేళనే చూడాలి, నన్ను వదిలి నీవు పోలేవులే, ఈ నాటి ఈ బంధం ఏనాటిదో..’ అంటూ సావిత్రి సినీ కెరీర్‌కు సంబంధించిన డైలాగ్స్‌, పాటలను వినిపించారు. ఇలా చాలా ఆసక్తికరంగా ఈ వీడియోను రూపొందించారు.

సమంత, దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ, విక్రమ్‌ ప్రభు, షాలిని పాండే, ప్రకాశ్‌రాజ్‌, మోహన్‌బాబు ‘మహానటి’లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్‌ పతాకంపై తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. 29 మార్చి 2018న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: