హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ అద్భుత సృష్టికి ప్రతిరూపం ‘జురాసిక్ పార్క్’. పరిచయం అక్కర్లేని ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రేమికుల మనసు దోచిందీ చిత్రం. ఆ తర్వాత ‘జురాసిక్‌పార్క్’ సిరీస్‌లో వచ్చిన ప్రతీ సినిమా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. డైనోసార్లతో హీరో చేసే సాహసాలు, దానికి దొరకకుండా తప్పించుకునే ప్రయత్నం థియేటర్లోని ప్రేక్షకుడిని మునివేళ్లపై నిలబెట్టాయి.
తాజాగా ఈ సిరీస్‌లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్‌డమ్’. 2015లో వచ్చిన ‘జురాసిక్ వరల్డ్’కు ఇది సీక్వెల్. జె.ఏ.బెయోనా దర్శకుడు. క్రిస్ ప్రాట్, బ్రెసీ డల్లాస్ హోవర్డ్, బి.డి.వాంగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్పీల్ బర్గ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. యూనివర్సల్ పిక్చర్స్, అంబ్లిన్ ఎంటర్‌టైన్‌మెంట్, ది కెనడీ మార్షల్ కంపెనీ, లెజండరీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇస్లా నబ్లర్ దీవిలోని అగ్నిపర్వతం బద్దలవడంతో డైనోసార్లుకు ప్రమాదం వాటిల్లుతుంది. ఆ ప్రమాదం నుంచి డైనోసార్ల జాతిని కథానాయకుడు ఏ విధంగా రక్షించాడు? ఈ నేపథ్యంలో అతను ఎదుర్కొన్న పరిస్థితులను ఈ చిత్రంలో చూపించనున్నారు. జూన్ 22, 2018న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
‘జురాసిక్ పార్క్’ సిరీస్‌లో ఇప్పటివరకూ ‘జురాసిక్ పార్క్’ (1993), ‘ది లాస్ట్ వరల్డ్: జురాసిక్ పార్క్’ (1997), ‘జురాసిక్ పార్క్-3’ (2001), ‘జురాసిక్ వరల్డ్’ (2015), చిత్రాలు రాగా, తాజాగా వస్తున్న ‘జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్‌డమ్’ (2018) ఐదో సినిమా. తొలి చిత్రం 63 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా, 1.029 బిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది.
Post A Comment: