అక్కినేని నాగేశ్వరరావుగా ఆయన మనవడు నాగ చైతన్య కనిపించబోతున్నారు. నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘మహానటి’లో ఏఎన్నార్‌తో పాటు, ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు, జెమినీ గణేశన్, చక్రపాణి తదితర ప్రముఖుల పాత్రలు కీలకం. ఎస్వీ రంగారావుగా మెహన్‌బాబు, చక్రపాణిగా ప్రకాష్‌రాజ్ నటిస్తున్నారు. మరి ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రల్లో ఎవరు కనిపిస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఏఎన్నార్ పాత్ర కోసం ఆయన మనవడైన నాగచైతన్యని ఎంపిక చేసుకొంది చిత్రబృందం.
తాత పాత్రని పోషించడానికి ఒప్పుకొన్న నాగచైతన్య త్వరలోనే సెట్స్‌పైకి అడుగుపెట్టబోతున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. సావిత్రిగా కీర్తి సురేష్, జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. సమంత ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.
Post A Comment: